BREAKING
నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం మాజీ ఎఫ్‌బీఐ అధికారులపై క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా ఫెడరల్ జడ్జి! చిలగడదుంపతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు వెల్లడిస్తున్న పోషకాల నిజాలు ఇవే! నందికందిని కమ్మేస్తున్న కాలుష్య మేఘాలు! కృత్రిమ మేధస్సు యుగంలో జర్మనీ డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య పరిరక్షణ మహా పాదయాత్రకు సంగారెడ్డి బీజేపీ నాయకుల పయనం! సీపీఐ(ఎం) పాదయాత్రకు ప్రజాదరణ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్: సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వార్తలు! తెల్లాపూర్‌లో అక్రమ బోర్‌వెల్ కేంద్రాలపై అధికారుల దాడులు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి యుఏఈలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పర్యటన హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో అనంతపురం కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..   ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో అనంతపురం కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..

(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం పురపాలక సంఘాల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మంగళవారం ఉదయం 8 గంటలకు ఆయా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.అనంతపురం నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మేయర్ అభ్యర్థులు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ సిబ్బంది, అనుమతి పొందిన అభ్యర్థుల ఏజెంట్లకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. వారికి కేటాయించిన టేబుళ్ల వద్ద బ్యారికేడ్ల వెనుక నుంచి ఓట్ల లెక్కింపును పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అనంతపురం నగరంలోని 62 వార్డులకు 62 కౌంటింగ్ టేబుళ్లు, మేయర్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 24 టేబుళ్లను ఏర్పాటు చేశారు.కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపునకు సిద్ధమైంది.