రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులు, హామ్ రోడ్ల పురోగతి, టిమ్స్ ఆస్పత్రులు, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ, నూతన హైకోర్టు భవన నిర్మాణాలపై సమీక్షించారు. ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను వేగవంతం చేసి, ఈ ఏడాదిలోనే ప్రజలకు అందు బాటులోకితీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సును తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, మౌలిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటే వేదికగా మలచాలని సూచించారు.సదస్సులో ప్రత్యేక తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయడంతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని, డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఈ సదస్సును ప్రీ-సమ్మిట్‌గా వినియోగించుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.85వ ఐఆర్ సి వేదికగా రాష్ట్ర రహదారి నెట్‌వర్క్, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రకటనలువెలువడనున్న నేపథ్యంలో, ఈ సదస్సునువిజయవంతం చేసి తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు కొత్త అవకాశాలు సృష్టించాలని అధికారులకు సూచించారు.