BREAKING
సీపీఐ(ఎం) పాదయాత్రకు ప్రజాదరణ 154పోస్టల్ బ్యాలెట్ లను వినియోగించుకున్నారు త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్: సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వార్తలు! తెల్లాపూర్‌లో అక్రమ బోర్‌వెల్ కేంద్రాలపై అధికారుల దాడులు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి యుఏఈలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పర్యటన హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి ఓట్ల లెక్కింపులో సంయమనం పాటించాలి – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాగు భూమి సంరక్షణ కార్యక్రమం అవగాహన కళాశాలల సమీపంలో మద్యం విక్రయాలు! జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు

టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పుట్టి సాయిలు

Select Suryaa Now
 టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పుట్టి సాయిలు


తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ తార్నాక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు వందమంది హాజరయ్యారు 
ఈ సమావేశంలో క్రింది తీర్మానాలను ఏకీగ్రీవంగా చేయడం జరిగింది, 
1) గ్రేటర్ హైదరాబాద్ లో జీవో ఎంఎస్ 168 ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది 
2) జీవో 168 సమస్యపై ఈనెల 28న ప్రెస్ మీట్ లు పెట్టాలని 29 న జిహెచ్ఎంసి కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, నవంబర్ 3 న జిహెచ్ఎంసి ఆఫీస్ ల ముందు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగింది 
3) ప్రతి సంవత్సరం లాగానే నూతన క్యాలెండర్----డైరీ ని తీసుకురావాలని డిసెంబర్ చివరి వారంలో హైదరాబాదులో సభ పెట్టి ఆవిష్కరణ చేయాలని తీర్మానం చేయడం జరిగింది 
4) అన్ని జిల్లా స్థాయి సమావేశాలు పెట్టి కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని డిసెంబర్ 10 లోపు ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని తీర్మానం  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా
బాచేపల్లి గ్రామానికి చెందిన పుట్టి. సాయిలు నూతనంగా నియమించడం జరిగింది, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వనజను నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది, 
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ మరో తీర్మానం చేయడం జరిగింది, జిహెచ్ఎంసి కార్యాలయాల ముందు జరగబోవు ధర్నాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పుట్టి సాయిలు ను బాచేపల్లి సర్పంచ్ శ్రీకాంత్ ఖానాపూర్.బి సర్పంచ్ గంగారం రాపర్తి మాజీ సర్పంచ్ శ్రావణ్ రామ్ రెడ్డి పేట్ మాజీ ఎంపిటిసి కృష్ణ బాబ్య నాయక్  అశోక్ నాలుగు గ్రామాల పెద్దలు తదితరులు సన్మానించారు