BREAKING
హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి ఓట్ల లెక్కింపులో సంయమనం పాటించాలి – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాగు భూమి సంరక్షణ కార్యక్రమం అవగాహన కళాశాలల సమీపంలో మద్యం విక్రయాలు! జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు మల్లేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా .. సోలక్ పల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమా: నిపుణులు హెచ్చరిస్తున్న నిజాలు ఇవే! ఏఎన్యూలో కౌంటింగ్ కేంద్రం.. పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందాల్. గౌహతి వేదికగా పీఎం-సేతు పథకం కింద కీలక ఒప్పందాలు ఐదుకల్లు లో వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి ఎమ్మెస్ మహాదేవి ప్రచారం.

పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

Select Suryaa Now
పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

పలాస, సూర్య : పలాస మండలం శాసనం గ్రామానికి చెందిన బారకల కృష్ణారావు రాజస్థాన్ లో ఆర్మీ జవాన్ గా 18 ఏళ్ల పాటు పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయనను గ్రామస్తులు సోమవారం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రత్యేక వాహనంలో ఆర్మీ జవాన్ బారకల కృష్ణారావు, భార్య లలితలను జాతీయ జెండాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువెళ్లారు.

18 ఏళ్లు ఆర్మీలో సేవ, ఇది మరువలేని గౌరవం - జవాన్ కృష్ణారావు

ఈ సందర్భంగా జవాన్ బారకల కృష్ణారావు మాట్లాడుతూ 18 ఏళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో పని చేశానని, మొదట రాజస్థాన్ లో ఆర్మీలో చేరానని చెప్పారు. ఒక ఏడాది పాటు ఇండియన్ ఆర్మీ ఆదేశాల మేరకు సౌత్ ఆఫ్రికా దేశంలో పని చేస్తూ తిరిగి రాజస్థాన్ ఆర్మీలో పని చేశానని తెలిపారు. 18 ఏళ్లు ఆర్మీలో పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.గ్రామస్తులు జాతీయ జెండాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువెళ్లడం, ఘనంగా సన్మానించడం జీవితంలో మరువలేనిదని, తనకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.కార్యక్రమంలో కుప్పిలి శివకుమార్, మంగి సంతోష్ కుమార్, బారకల జీవనరావు, బి.కుమారస్వామి, పి.సునీల్, డిల్లి జయరాం, అల్లాడ రవికుమార్, కొత్త ధర్మారావు, మంగి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.