విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమున్సిపల్ ఎన్నికల విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలని రామచంద్రపురం డి ఎస్పీ శేషు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం డి ఎస్పీ శేషు మీడియా తో మాట్లాడారు.
ఊరేగింపులు, డి జే లు, బాణాసంచా కాల్పులు పూర్తిగా నిషేధం ఉంద న్నారు.
ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కొనసాగుతుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలిసిన ఆనందంతో ర్యాలీలు డీజేలు, బాణాసంచా కాల్పులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక ప్రక్క సెక్షన్ 30 పోలీస్ శాఖ అమల్లో ఉందని, మరోపక్క జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్నందున ఎటువంటి ఊరేగింపులు ర్యాలీలు జరపరాదన్నారు.
ఓడిన, గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
గెలుపొందిన వారు, ఓడిపోయిన వారు మన వాళ్లే కింద భావించాలాన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కౌంటింగ్ సందర్భంగా 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రధానమైన కూడల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు నిఘా పెట్టాం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సమావేశం లో సి ఐ వెంకట నారాయణ, ఎస్ ఐ లు నాగేశ్వరరావు, లక్ష్మణ్ లు పాల్గొన్నారు.