BREAKING
సీపీఐ(ఎం) పాదయాత్రకు ప్రజాదరణ 154పోస్టల్ బ్యాలెట్ లను వినియోగించుకున్నారు త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్: సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వార్తలు! తెల్లాపూర్‌లో అక్రమ బోర్‌వెల్ కేంద్రాలపై అధికారుల దాడులు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి యుఏఈలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పర్యటన హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి ఓట్ల లెక్కింపులో సంయమనం పాటించాలి – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాగు భూమి సంరక్షణ కార్యక్రమం అవగాహన కళాశాలల సమీపంలో మద్యం విక్రయాలు! జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

పార్వతీపురం, సూర్య : పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువలను నేపథ్యంలో జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్కింపు కేంద్రాన్ని నిర్ణయించినందున ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోయే ఎన్నికల ఫలితాలు లెక్కింపు కేంద్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు మరియు చైర్పర్సన్ అభ్యర్థి తోపాటు లెక్కింపు ఏజెంట్లుగా వెళ్లబోతున్న కార్యకర్తలకు సోమవారం మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో చైర్ పర్సన్ అభ్యర్థితో పాటు 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు వారి ఏజెంట్లుకి తగు సూచనలు, సలహాలు ఇచ్చి రేపు మంగళవారం ఉదయం 8 గంటలకు కచ్చితంగా ఎన్నికల కేంద్రం వద్దకు చేరుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు నిరక్షణకు తావు లేకుండా కౌంటింగ్ టేబుల్ వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఓటు కీలకం కాబట్టి ప్రతి ఒక్క పరిశీలించి ఏదైనా అనుమానం వచ్చిన ఓట్లను అధికారులు చెప్పే పక్కన ఉంచాలని, కౌంటింగ్ మొత్తం పూర్తి అయిపోయాక అధికారులు నిర్ధారణ పత్రాలు మంజూరు చేసిన మాత్రమే కేంద్రం నుంచి బయటకు రావాలని ఏ ఒక్కరు కూడా తొందరపాటు చర్యలకి పోకుండా అందరు కూడా చాలా ఓర్పుతో లెక్కింపు చివరి క్షణం వరకు వేచి చూడాలని అందుకు సంబంధించిన నియమాలు నిబంధనలు వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ అభ్యర్థి పట్నాన సాయి శ్రీ, పట్టణ పార్టీ అధ్యక్షులు గొర్లి మాధవరావు, జిల్లా పార్టీ కార్యదర్శి పోల సత్యనారాయణ, జిల్లా వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్వీశెట్టి శ్రీనివాసరావు, షేక్ షఫీ, పాత గౌరీశంకరరావు, 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.