స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి జి. అభిరామ్ ఎంపిక
రామాయంపేట;ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో సిద్దిపేట లో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్(అండర్ -14) రన్నింగ్ పోటీలలో రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ (G. Abhiram) ద్వితీయ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేత అభిరామ్‌ను పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వాసవి సురేష్, హెడ్మాస్టర్ సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు (PETs) అనిల్, శ్రీశైలం, స్రవంతి మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.రాష్ట్ర స్థాయి పోటీలలోనూ అభిరామ్ ప్రతిభ చాటి విజయం సాధించాలని యజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.