జోరు వానలోనూ తగ్గని జోరు..
పాతపట్నం, సూర్య : ప్రజాక్షేత్రంలో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు టంకాల డిల్లేశ్వరరావు పాతపట్నం మండలం రాజకీయ వేదికపై గంగువాడ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసి అభ్యర్థి టంకాల డిల్లేశ్వరరావు పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ, ప్రజల స్పందనే కొలమానంగా ఆయన సాగిస్తున్న ఎన్నికల ప్రచారం సంపూర్ణ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. సోమవారం రోజున వాతావరణం సహకరించకపోయినా, కురుస్తున్న జోరు వానను కూడా లెక్కచేయకుండా టంకాల డిల్లేశ్వరరావు తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. వాతావరణంలోని ప్రతికూలతలను సైతం కార్యకర్తల ఉత్సాహం, ప్రజల ఆదరాభిమానాలు పటాపంచలు చేశాయి. గంగువాడ వీధుల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ ఆయన సాగించిన ప్రచారం గ్రామ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
ప్రజా సమస్యలే అస్త్రంగా... టీడీపీ అరాచకాలపై నిలదీత
ఈ ప్రచార కార్యక్రమంలో టంకాల డిల్లేశ్వరరావు కేవలం ఓట్లడగడానికే పరిమితం కాకుండా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు, సామాన్యుడు కనీసం బతకలేని దుర్భర పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను, అరాచక పాలనను ఎండగడుతూ ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడానికి గల కారణాలను వివరిస్తూ, సంక్షేమ పాలనను అందించే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ప్రతి ఓటరుకూ వైసిపి విధానాలు, సంక్షేమ ధ్యేయాన్ని చేరువ చేస్తూ సాగిన ఈ ప్రచార శైలి అందరి ప్రశంసలను అందుకుంది.
నీరాజనం పడుతున్న గంగువాడ ప్రజానీకం
జోరు వానను సైతం లెక్కచేయకుండా డిల్లేశ్వరరావు నిర్వహిస్తున్న ప్రచారానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మంగళహారతులతో, పూలవర్షంతో ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. "మా కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు మాకే కావాలి" అంటూ గ్రామస్తులు స్వచ్ఛందంగా ప్రచారంలో భాగస్వామ్యం కావడం విశేషం.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వందలాది మంది కార్యకర్తలు, గ్రామస్తులు అత్యంత ఉత్సాహంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య సాగిన ఈ ప్రచార ర్యాలీ గంగువాడలో వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమనే సంకేతాలను స్పష్టంగా ఇస్తోంది.