కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
మక్కువ, సూర్య : జరగనున్న మండల పరిషత్ , జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి. సంధ్యారాణి అన్నారు. మండలంలోని కాశీపట్నం, మక్కువ గ్రామాలలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మమతమ గ్రామాలను అభివృద్ధి పరచాలంటే కూటమి ప్రభుత్వం తరపున అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. మక్కువ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానన్నారు. మీ సొంత ఆడపడుచుని, మక్కువ మండలాన్ని అభివృద్ధి పదం లోకి తీసుకువెళ్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాల న్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గుళ్ల. వేణుగోపాల్ నాయుడు, టీడిపి నాయకులు డాక్టర్ మల్లేశ్వరరావు, దాసరి.కేశవ,ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు పాల్గొన్నారు.