స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఎన్నికల ప్రవర్తన నియమావళి నియమ నిబంధనలు పాటిస్తూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు స్తు నడుమ స్ట్రాంగ్ రూములో బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణలో నిరంతర నిఘాలో ఉంటాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఆర్.మహేష్ కుమార్ తెలియజేశారు. ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ ముగిసిన అనంతరం అమలాపురం అర్బన్ పరిధిలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఆర్. మహేష్ కుమార్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి. ప్రశాంతి ఐఏఎస్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల భద్రతా ఏర్పాట్లను, గదికి వేసిన సీళ్లను పరిశీలించి, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలని, భద్రతా సిబ్బంది విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ బాక్సుల భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ పరిశీలనలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎం నిర్మల్ కుమార్ సంబంధిత ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.