కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
వత్సవాయ మండలంలోని కంభంపాడు గ్రామ ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కంభంపాడు ఎంపీటీసీ అభ్యర్థి తీగల కృష్ణ, జడ్పీటీసీ అభ్యర్థి కాటేపల్లి రవికి మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వేమిరెడ్డి వెంకట నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వెంకట నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు, ప్రజలు తమ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, జగనన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.