పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం
ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారం బ్రిక్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాజనాల ప్రసాద్ తెలిపారు.ఈ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 2వ తేదీ సోమవారం ఇంధన పొదుపు (సేవ్ ఎనర్జీ) అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పెరవలి, కాపవరం, అజ్జరం, మల్లేశ్వరం, అన్నవరప్పాడు తదితర ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.ఇంధనాన్ని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం, విద్యుత్ ఆదా చేయడం, ఇంధన వనరుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.బ్రిక్స్ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 7వ తేదీ వరకు మండలంలోని వివిధ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో షెడ్యూల్ ప్రకారం రోజుకో అంశంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ రాజనాల ప్రసాద్ వివరించారు.