BREAKING
అమితాబ్ బచ్చన్‌కు జయ బచ్చన్ పెట్టిన ముద్దుపేరు: హరివంశ్‌ రాయ్ బచ్చన్ ఎందుకు వారించారంటే! సర్పంచ్ అభ్యర్థిగా సత్యవేణి ప్రజల ముందుకు.. అభివృద్ధికి అండగా ఉంటానన్న మాజీ ఎంపీటీసీ వీర వెంకటరావు ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్ పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు అల్లు అర్జున్ మాటలతో నా జీవితం మారిపోయింది: కమెడియన్ ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు! సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా

తిరుమలఇంజినీరింగ్ కళాశాలలో యమహా మోటార్స్ క్యాంపస్ నియామకాలు..

Select Suryaa Now
తిరుమలఇంజినీరింగ్ కళాశాలలో యమహా మోటార్స్ క్యాంపస్ నియామకాలు..

20 మందివిద్యార్థులకు ఉద్యోగాలు

నరసరావుపేట న్యూస్ : మండలపరిధిలోని స్థానిక జొన్నలగడ్డలో ఉన్న తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో చెన్నైకు చెందిన ప్రముఖ సంస్థ యమహా మోటార్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 29న క్యాంపస్ నియామకప్రక్రియ నిర్వహించారు. ఈ నియామక ప్రక్రియలోభాగంగా నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 140 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 80 మంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. అనంతరం నిర్వహించిన టెక్నికల్ తదితర ఎంపిక ప్రక్రియల ద్వారా మొత్తం 20 మంది విద్యార్థులు తుది ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఈసీఈ  విభాగంనుంచి 19 మంది, ఈఈఈ విభాగం నుంచి ఒక విద్యార్థి ఉన్నారు. వీరంతా ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలకు సంవత్సరానికి రూ.2.80 లక్షల వేతన ప్యాకేజీతో ఎంపికయ్యారు. ఈ నియామక ప్రక్రియనుకంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధి వేణుగోపాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలచైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రావెల సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డా. వై.వి. నారాయణ, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారి ఎం. సాంబశివరావు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపికైనవిద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో అందించిన నాణ్యమైన శిక్షణ, మాక్ ఇంటర్వ్యూలు, ప్రత్యేక ప్లేస్‌మెంట్ శిక్షణ తమ విజయానికి ఎంతగానోదోహదపడ్డాయని తెలిపారు. తమకు విలువైన ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన కళాశాల యాజమాన్యానికి, ప్లేస్‌మెంట్ విభాగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.