పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
పెరవలి మేజర్ న్యూస్ ;తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండవ సాధారణ ఎన్నికలు – 2026 షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీ సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.పెరవలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధుల్లో ఉన్న మొత్తం 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పెరవలి మండల ప్రత్యేక అధికారి మరియు రిటర్నింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్ తెలిపారు.ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.