BREAKING
ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపు పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేదెవరికో..? టిడిపి చరిత్ర తిరగరాస్తుందా.. వైసీపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా! ఘనంగా ఏ సీ సీ ఏ సక్సెస్ మీట్ 2026 - అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహణ ఈరోజు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు మరియు ప్రయోజనాలు! రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ!

మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి

Select Suryaa Now
మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి

                                   తొండవరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం
 అంబాజీపేట మేజర్ న్యూస్ :రానున్న మండల పరిషత్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తొండవరం గ్రామంలో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విత్తనాల దుర్గాభవానీ శేఖర్, ఎంపీటీసీ అభ్యర్థి కడలి చంద్రకళ సుబ్బారావు లు  ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే యువతకు, ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామని కోరారు. తొండవరం గ్రామంలోని ఎస్సీ ఏరియా, వెన్నపువారి కాలనీ, రూతమ్మ కాలనీ, గొల్లపాలెం, ఓసీ ఏరియా, రజకపేటలలో పర్యటించి, ఈ నెల 5న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఆ పార్టీ సీనియర్ నాయకులు కొర్లపాటి కోటబాబు, సుదాబత్తుల రాము, మద్దింశెట్టి మల్లిబాబు లు ప్రచారంలో పాల్గొని వారికి మద్దతు గా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు.ప్రతి నెలా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, ప్రతి గ్రామంలో సచివాలయ భవనాలను నిర్మించి ఉద్యోగాలు కల్పించామన్నారు. 

గ్రామ సచివాలయం నుంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా చేశామన్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను చేర్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు.నేడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని చూపుతూ అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కొత్త పింఛన్లు కానీ, కొత్తగా పక్కా గృహాలు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రజలకు అందించిన దాఖలాలులేవన్నారు‌ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత నాశనం చేస్తారని, భవిష్యత్తు బాగుండాలంటే వైసీపీ అభ్యర్థులను  గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో మండల,రెండు గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,  ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు.