స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులంతా పనిచేయాలని ఎంపీడీవో పివిఆర్ కే రాజు అన్నారు సోమవారం టీటీడీ కళ్యాణ మండపంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పి.ఓ.లు ఎ.పి.ఓ.లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణా కార్యక్రమంలో నియమించబడిన మాస్టర్ ట్రైనర్లు పాల్గొని, పి.ఓ.లు మరియు ఎ.పి.ఓ.లకు ఎం.పి.టి.సి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, నియమ నిబంధనలు మరియు పోలింగ్ ప్రక్రియపై సమగ్రంగా శిక్షణ అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విధుల నిర్వహణలో పాటించవలసిన నియమ నిబంధనలు, పోలింగ్‌కు ముందు చేపట్టవలసిన ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ, బ్యాలెట్ పేపర్ల వినియోగం, ఓటరు గుర్తింపు, ఓటు వేసే విధానం, ఓటు గోప్యతను కాపాడటం, పోలింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై సిబ్బందికి సమగ్రంగా అవగాహన కల్పించారు అదేవిధంగా పోలింగ్ ప్రారంభానికి ముందు నిర్వహించవలసిన విధులు, మాక్ పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ సమయంలో వివిధ రిజిస్టర్ల నిర్వహణ, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పేపర్లు మరియు ఎన్నికల సామగ్రిని నిబంధనల ప్రకారం ప్యాక్ చేయడం, సీలింగ్ ప్రక్రియ, ఎన్నికల రికార్డులను సంబంధిత అధికారులకు అప్పగించడం వంటి అంశాలపై వివరంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఎన్నికల విధులలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి పి.వి.ప్రసాదరావు పరిపాలనాధికారి వి.రామ స్వారూప్ లు పాల్గొన్నారు