కడియం మండలంలో కూటమి ప్రచార జోరు..
కడియం, మేజర్ న్యూస్, :స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడియం మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కడియపులంక, బుర్రిలంక, వెంకయమ్మపేట గ్రామాల్లో కూటమి అభ్యర్థులు నిర్వహించిన ప్రచార కార్యక్రమం జనసందోహంతో హోరెత్తింది. వీధులన్నీ ప్రజలు, పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోగా, భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది.
కడియం మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థిని రత్నం మహేశ్వరి దేవి అయ్యప్ప, ఎంపీపీ అభ్యర్థిని బోడపాటి గోపి మోహిని వీర పుణ్యవతి, ఎంపీటీసీ అభ్యర్థులు తాళం నరేష్, నాగులపల్లి వీరబాబు, క్రొవ్విడి వాసు, అంజూరి లక్ష్మి ఆయా గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.గ్రామాల్లో వెల్లువెత్తిన జనసందోహం, కూటమి శ్రేణుల ఉత్సాహం, నాయకులు, కార్యకర్తల సమిష్టి భాగస్వామ్యంతో ప్రచార కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల సమన్వయం, అభ్యర్థుల ప్రజా చేరువ ఈ ర్యాలీ ద్వారా స్పష్టంగా కనిపించాయి.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ హెల్త్ వింగ్ జనరల్ సెక్రటరీ గోరంట్ల రవికిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రాజమహేంద్రవరం మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, కడియం మండల జనసేన అధ్యక్షుడు ముద్రగడ జెమి, మాజీ వైస్ ఎంపీపీ పంతం గణపతి, మండల కూటమి నాయకులు గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, గెడ్డం శివ, ఆదిమూలం సాయి తదితరులు పాల్గొన్నారు.