BREAKING
సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం

అన్నోజిగూడలో ఘనంగా బొడ్రాయి పండుగ ఉత్సవాలు

Select Suryaa Now
అన్నోజిగూడలో ఘనంగా బొడ్రాయి పండుగ ఉత్సవాలు

కందుకూరు: గ్రామీణ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ప్రముఖ సంఘ సేవకులు అంబర్‌పేట శంకర్ ముదిరాజ్ అన్నారు. కందుకూరు మండలం అన్నోజిగూడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన నాభిశిల (బొడ్రాయి) పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ... నాభిశిలకు గ్రామీణ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, ఇది గ్రామ ప్రజల విశ్వాసాలకు, తరతరాల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తాయని తెలిపారు.
అంబర్‌పేట శంకరన్న రాకతో ఉత్సవాల్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కుర్నమొని జయేందర్ ముదిరాజ్ ఆయనకు స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రవీణ్, అశు, సాయి, మండల అధ్యక్షుడు పాండు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కొర్వి సురేందర్ ముదిరాజ్, యువజన అధ్యక్షుడు కాకి మధు ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ కాకి రాములు ముదిరాజ్, మాజీ సర్పంచ్ ఇందిరమ్మ దశరథ ముదిరాజ్, సర్పంచ్ లలిత కుమార్ ముదిరాజ్, సన్నీల సత్యనారాయణ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, సర్పంచ్ సురేష్ నాయక్, ఉపసర్పంచ్ పద్మ కృష్ణ ముదిరాజ్‌తో పాటు పలువురు గ్రామ పెద్దలు, ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ మేజర్ న్యూస్