తపోవనం, నాగిరెడ్డిపల్లిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి లాల్ స్వామి విస్తృత ప్రచారం స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటా ఆదరించి ఆశీర్వదించండి.. ఓటర్లకు లాల్ స్వామి విజ్ఞప్తి
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తపోవనం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో కూటమి నారాయణపురం 2 ఎంపీటీసీ అభ్యర్థి లాల్ స్వామి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థిగా తనను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని లాల్ స్వామి హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పదవిని బాధ్యతగా భావించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించి, విలువైన ఓటుతో గెలిపించి ఆశీర్వదించాలని లాల్ స్వామి ఓటర్లను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..