BREAKING
క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్!

మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత

Select Suryaa Now
మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత

మాగనూర్ సూర్య న్యూస్ :
మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఎలాంటి రవాణా పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు వేర్వేరు టిప్పర్ వాహనాలను సోమవారం రాత్రి పోలీసులు పెట్టుకున్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాగనూరు పోలీస్ సిబ్బంది తమ పరిధిలో రాత్రివేళ పెట్రోలింగ్ మరియు నిఘా విధుల్లో ఉన్న సమయంలో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. మండలంలోని వడ్వాట్ గేటు సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న టిప్పర్‌ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. మరొక ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లోనూ సరైన అనుమతులు లేని మరో టిప్పర్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించి ఇసుక రవాణాకు పాల్పడుతున్న రెండు టిప్పర్లతో పాటు వాటి డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందిన ఫిర్యాదుల మేరకు మాగనూరు పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎస్సై కె. మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.


ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం