BREAKING
పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు అల్లు అర్జున్ మాటలతో నా జీవితం మారిపోయింది: కమెడియన్ ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు! సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు ఎంపిక

నరసరావుపేట న్యూస్ : అక్టోబర్ 31న డాక్టర్ పి.ఎస్. రాజుజూనియర్ కళాశాల, కాజీపాలెంలో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-19 ఎస్.జి.ఎఫ్. (SGF) జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీలలో కళాశాలనుంచి మొత్తం 18 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 14, 15 తేదీలలోపశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఓగూరినాగేశ్వరరావు మాట్లాడుతూ అండర్-19 బాలుర విభాగంలో విద్యార్థులు పలు ఈవెంట్లలో ప్రతిభ కనబరిచి పతక స్థానాలను సాధించారు. కుంచాల చంద్రశేఖర్ ట్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానం, 400 మీటర్ల హర్డిల్స్‌లో ద్వితీయ స్థానం. గుమ్మా వెంకట నాగరాజు షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం, డిస్కస్ త్రోలో తృతీయ స్థానం. రామవత్ దుర్గాప్రసాద్ నాయక్ జావెలిన్ త్రోలో ప్రథమ స్థానం, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో తృతీయ స్థానం. దుబాకుల శివ లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానం. గోపిశెట్టి మణికంఠ హ్యామర్ త్రోలో ద్వితీయ స్థానం,నక్కాసాయి చరణ్ రెడ్డి 800 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం. నల్లబోతుల మల్లికార్జున లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం. భూక్యా నరసింహ నాయక్ లాంగ్ జంప్‌లో తృతీయ స్థానంసాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలసెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఇదే స్ఫూర్తితో రాణించి విజయాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహిం చారు. కళాశాల డైరెక్టర్లు కాట్ల రామ కోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, పాశం కృష్ణారావు, పి.వి. అచ్యుతరావు, ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు ఎంపికైన విద్యార్థులను అభినందించి, రాష్ట్ర స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.