ముసురుతుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెదకూరపాడు న్యూస్ : సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు వాతావరణంలో మార్పు వల్ల తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయని ముసురు తుఫాను కారణంగా ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదకూరపాడు తహసిల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించారు. నివాసాలలో తగిన ఆహార ఏర్పాట్లను నిల్వ ఉంచుకొని టార్చిలైట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వైపుకు వెళ్ళరాదని విద్యుత్ వైర్లు తెగిన ప్రదేశంలో ఉండరాదని తెలిపారు. వాతావరణ శాఖ ఆదేశాల మేరకు కలెక్టర్ సూచనలతో మండల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశామని ఎలాంటి ప్రమాదాలు జరిగిన హెల్ప్ లైన్ కు లేదా సమీపంలోనివిఆర్ఓ సంబంధిత అధికారులకు తెలియజేయాలని తహసిల్దార్ కోరారు