andhrapradesh
బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి
నరసరావుపేట న్యూస్ : దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా విక్రయాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై నరసరావుపేట ఆర్డీవో బాలకృష్ణ బాణసంచా దుకాణాల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణం లోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దుకాణాల్లో అగ్నిప్రమాదా లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. బాణసంచా విక్రయించే ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగానే బాణసంచా విక్రయాలు చేపట్టాలని, దుకాణాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, దీపావళి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేం దుకు అధికారులకు, దుకాణాల యజమానులకు సహకరించాలని ఆర్డీవో బాలకృష్ణ కోరారు.