పిడుగురాళ్ల రూరల్ న్యూస్ : పిడుగురాళ్ల మండలం, గుత్తికొండ గ్రామంలో డాక్టర్ వునం దీపిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్న దీపికకు మహిళలు మంగళ హారతులతో, జన నీరాజనాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా డాక్టర్ దీపిక మాట్లాడుతూ "ఇన్నాళ్లు వైద్యురాలిగా మీకు సేవలందించాను. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా మీ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు వచ్చాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి తననుఅఖండ మెజారిటీతో గెలిపించాలనిప్రార్థిస్తూ ప్రచారం నిర్వహించారు.డాక్టర్ దీపిక ప్రచారానికి గుత్తికొండ గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలిపారు. గ్రామంలో ఎక్కడ చూసినా దీపికకు అనుకూలంగా నినాదాలు మార్మోగాయి