BREAKING
అల్లు అర్జున్ మాటలతో నా జీవితం మారిపోయింది: కమెడియన్ ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు! సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం

వరుస తుపానులకు రైతులు విలువల

Select Suryaa Now
వరుస తుపానులకు రైతులు విలువల

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నకు వరుస తుఫాన్లు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. కష్టమైనా, నష్టమైనా వరి సాగు చేపట్టి భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ప్రకృతి కన్నీళ్లు మిగిల్చింది. అర్ణబ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే దెబ్బతిన్న వరి పంటకు, ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. చేతికందాల్సిన పంట కళ్లముందే నేలపాలవుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

నేలకొరిగిన పంట.. నీట మునిగిన ఆశలు,అర్ణబ్ తుఫాను ఈదురు గాలులకు వరి చేలు నేలకొరిగాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో చేలల్లో నీరు నిలిచిపోయి పంట ముంపునకు గురవుతోంది. ధాన్యం కంకులు కుళ్లిపోయి, గింజలు మొలకెత్తే ప్రమాదం నెలకొంది. ముఖ్యంగా కడియం ఆవ ప్రాంతాల్లో సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు కనీసం పంట చేతికొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

రైతుకు నష్టాలు.. సామాన్యుడికి ధరల సెగ.వరి దిగుబడులు తగ్గితే బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరిగిన బియ్యం ధరలు మరింత పైపైకి చేరితే మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడనుంది. పంట నష్టంతో రైతు అప్పులపాలవుతుంటే, వినియోగదారుడు అధిక ధరలకు బియ్యం కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, సామాన్యుడికి నిత్యావసరాల ధరలు భారంగా మారడం వ్యవసాయ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి

వరుస తుఫాన్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి పరిహారం అందించాలని, ముంపు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శాశ్వత మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అన్నదాత కష్టానికి తగిన ఫలితం దక్కకపోతే వ్యవసాయం ఎలా నిలదొక్కుకుంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. రైతును ఆదుకోవడంతో పాటు బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.