వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం.
కళ్యాణదుర్గం: శాసనసభ్యుడు అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు వర్లి గ్రామ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల లక్ష్మీ వెంకటేశులు, ఎంపీటీసీ అభ్యర్థి సింధు అనిల్ చౌదరికి మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫున పార్టీ శ్రేణులు ప్రజలకు ఎన్నికల విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. జడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల లక్ష్మీ వెంకటేశులును గెలిపించడం ద్వారా మండల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. అలాగే వర్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి సింధు అనిల్ చౌదరికి మద్దతుగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను నేరుగా కలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.