BREAKING
ఎంఈఓ గా కోటయ్య బాధ్యతలు.... జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ పై మాకు అనుమానాలున్నాయి భూ సమస్య ఫిర్యాదు పై ఏసీపి విచారణ...... రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి బీజేపీ మహా పాదయాత్రకు ఘన స్వాగతం ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది....... కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు. 'ఖేత్ బచావో అభియాన్' మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని.

ప్రతి విద్యార్థిలో భాషా, గణిత నైపుణ్యాలు పెంపొందించాలి - కలెక్టర్ కోయ శ్రీహర్ష

Select Suryaa Now
ప్రతి విద్యార్థిలో భాషా, గణిత నైపుణ్యాలు పెంపొందించాలి -  కలెక్టర్ కోయ శ్రీహర్ష

 

సూర్య - పెద్దపల్లి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో వినడం, మాట్లాడడం, చదవడం, సృజనాత్మకంగా రాయడం వంటి భాషా నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. తెలుగు, ఆంగ్లం, గణితంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందించాలన్నారు.
గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం ప్రక్రియల్లో ప్రతి విద్యార్థి పూర్తి స్థాయి నైపుణ్యం సాధించేలా బోధన చేపట్టాలని తెలిపారు. రెమిడియేషన్, AXL AI, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాల అమలును ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. డిజిటల్ అభ్యసనంలో విద్యార్థుల నమోదు, ప్రగతిని సమీక్షించాలని సూచించారు.
అనంతరం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ క్యాంపెయిన్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పి.ఎం. షేక్, అలోకిట్ ప్రతినిధులు, డీఆర్‌పీలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.