జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ పై మాకు అనుమానాలున్నాయి
సీతమ్మధార, సూర్య : విశాఖపట్నం లోని జీవీఎంసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి పోలింగ్ శాతాల్లో గందరగోళంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్ధి వరుదు కల్యాణి, అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు జీవీఎంసీ ఎన్నికల్లో ఆకస్మికంగా పెరిగిన పోలింగ్ శాతాలు సాయంత్రానికి 50.02 శాతం, రాత్రికి 51.47 శాతం పోలింగ్మ రుసటి రోజు ఉదయానికి 56.32 శాతం జరిగినట్లు ప్రకటన రాత్రికి రాత్రే 89,124 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి కె.కె రాజు రాజు ప్రశ్నించారు. అభ్యర్దుల్లేకుండానే స్ట్రాంగ్ రూమ్ లోకి బ్యాలెట్ బాక్సులు అధికారుల్ని అడిగితే సమాచార లోపం అంటున్నారు. ఎక్కడా ఎన్నికల నిబంధనలు పాటించడం లేదు పోలింగ్ శాతాలపై మేయర్ అభ్యర్ధికి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు పోలింగ్ శాతాల్ని మార్చారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయని, సీసీ కెమెరాలు లేకుండా పోలింగ్ నిర్వహణ, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్ధులు లేకుండా స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్సులు పెట్టి సీల్ వేసేందుకు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఆయా ఘటనలపై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వాలని, పోలింగ్ శాతాలపై సమగ్ర వివరాలు మేయర్ అభ్యర్ధికి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటం చేసేందుకు సైతం సిద్దమని ఆయన హెచ్చరించారు.
జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాలపై అనుమానాలు
విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్ని స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారుల్ని ముందు నుంచీ కోరుతూ వచ్చాం. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశాయో రాష్ట్రమంతా చూసింది. ఓటమి భయంతో పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. భౌతిక దాడులకు ప్రయత్నించి విధ్వంసాలకు కూడా పాల్పడ్డారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో అలాంటి విష సంస్కృతిని తీసుకురావద్దని మేం సూచించాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతీ పోలింగ్ స్టేషన్ తో పాటు బయట, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినా అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం వరకూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి డమ్మీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిపై కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ రాతపూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోకుండా చివరి నిమిషంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం వల్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు. నిన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఎస్ఈసీ పోలింగ్ శాతాల్ని ప్రకటించింది. విశాఖ కార్పోరేషన్లో 50.02 శాతం పోలింగ్ జరిగింది, ఇంకా సమాచారం రావాల్సి ఉందని సాయంత్రం చెప్పారు. నిన్న రాత్రి 10.47కు కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి 51.47 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. ఇందులో స్పష్టత లేదు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల రాత్రి 7.15 గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. ఈ ఉదయం జీవీఎంసీ కమిషనర్, ఐ అండ్ పీఆర్ వెబ్ సైట్ లో కూడా జీవీఎంసీ ఎన్నికల్లో 56.32 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. జోన్ల వారీగా కూడా ఇందులో వివరాలు ఇచ్చారు. రాత్రి 10.47కు ఇచ్చిన వివరాలకూ, ఉదయం ఇచ్చిన వివరాలకూ మధ్య సుమారు 5 శాతం ఓట్లు పెరిగాయి. అంటే 89124 ఓట్లు అదనంగా ఉన్నాయి అన్నారు.
ఎస్ఈసీ స్పందించకపోతే న్యాయపోరాటమే
మీ సమాచార లోపం వల్ల తప్పులు జరిగి ఉంటే ఫామ్ 27 ప్రకారం 120 డివిజన్లలోనూ 1990 పోలింగ్ స్టేషన్లలోనూ నమోదైన పోలింగ్ సమగ్ర వివరాలు మేయర్ అభ్యర్ధికి ఇవ్వాలని ఆర్వోకు ఇవాళ వినతిపత్రం ఇచ్చాం. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లలో బ్యాలెట్ బాక్సులు పెట్టి పవర్ కట్ చేయాలి. వెంటనే తలుపులు మూసేసి నిబంధనల ప్రకారం సీల్ చేయాలి. కానీ నిన్న జీవీఎంసీ ఎన్నికల్లో మాత్రం ఏ స్ట్రాంగ్ రూమ్ లో కూడా రాత్రి 1.10 నిమిషాల వరకూ సీల్ చేయకుండా వదిలేశారు. మేం ప్రశ్నిస్తే మీరు వెళ్లిపోండి, మేం సీల్ చేస్తామని అధికారులు చెప్పారు. ఇది సరికాదు, నిబంధనలు పాటించాలని గట్టిగా అడిగితే అప్పుడు సీల్ వేశారు. సమాచారం లోపం వల్లే సీల్ వేసే మెటిరియల్ ప్రొక్యూర్ చేయలేకపోయాం అని అధికారులు చెప్తున్నారు. ఎప్పుడూ ఇలా జరగలేదు. అంటే పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఇప్పటికైనా పోలింగ్ కు సంబంధించి అధికారులు చేసిన ప్రకటనలపై స్పష్టత, సమగ్ర పోలింగ్ శాతం వివరాలు ఇచ్చి తీరాల్సిందే. ఓటమి భయంతో అక్రమాలకు పాల్పడాలని చూశారు, వాటిని మేం కొంతవరకూ అడ్డుకున్నాం. అయినా ఏదో జరిగిందనే అనుమానాలు మాకు ఉన్నాయి. వాటిని అధికారులు నివృత్తి చేయాల్సిందే. అధికార కూటమికి బానిసలుగా కొందరు అధికారులు పనిచేశారు. దీని మీద ఎస్ఈసీకి కూడా మేం ఫిర్యాదు చేశాం. భవిష్యత్తులో అవసరమైతే న్యాయపోరాటానికి సైతం సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ , పేడ రమణి కుమారి, పీలా వెంకటలక్ష్మి, పీలా ఉమారాణి, అంబటి శైలేష్, బాజీ నాయుడు, సరఫరా రవీంద్ర భారతి, పాక సత్యనారాయణ, పాల్ విక్టర్, పాల్గొన్నారు