BREAKING
క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్!

రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం

Select Suryaa Now
రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే  జగ్గిరెడ్డి ప్రచారం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరావులపాలెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల జడ్పీటీసీ అభ్యర్థి మల్లిడి లావణ్యతో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తినడానికి తిండి కూడా భారంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, మహిళలకు వాగ్దానం చేసిన పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, రాప్తాడు ఘటన వంటి సంఘటనలు మహిళల రక్షణపై ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తున్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఎన్నికల ప్రక్రియలో అడ్డదారులు తొక్కడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు.

ప్రజలారా.. ఒక్కసారి ఆలోచించండి. మీ సమస్యలపై స్పందించే అభ్యర్థులను ఆదరించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని చిర్ల జగ్గిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

ఈ పర్యటనలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.