BREAKING
మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపు పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేదెవరికో..? టిడిపి చరిత్ర తిరగరాస్తుందా.. వైసీపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా! ఘనంగా ఏ సీ సీ ఏ సక్సెస్ మీట్ 2026 - అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహణ ఈరోజు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం

Select Suryaa Now
విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం
 గుంటూరు కలెక్టరేట్ న్యూస్ : ​ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ విశ్వవిద్యాలయంలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ ఘనంగా ముగిసింది. ఆఫీస్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ రిలేషన్స్‌ ఆధ్వర్యంలో ‘రీఇమాజినింగ్‌ టాలెంట్‌ ఫర్‌ ద ఏఐ ఎకానమీ – బిల్డింగ్‌ ఇండస్ట్రీ–రెడీ టాలెంట్‌’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారే సాంకేతికత, ఏఐ (AI) అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ కాన్‌క్లేవ్‌ ప్రధాన ఉద్దేశమని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఏఐ, కంప్యూటింగ్, బిజినెస్ & హెచ్‌ఆర్, అగ్రి-ఫుడ్, ఇండస్ట్రీ 5.0 (కోర్ ఇంజినీరింగ్), సెమీకండక్టర్లు &,ఇంటెలిజెంట్ సిస్టమ్స్, లైఫ్ సైన్సెస్ వంటి ఆరు కీలక విభాగాలపై పారిశ్రామిక నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.​ఏఐ–పవర్డ్‌ హెచ్‌ఆర్‌ యాక్టివిటీస్ లో భాగంగా  అధునాతన నియామక ప్రక్రియలపై అవగాహన.​గ్లోబల్ కెరీర్ సెషన్: విదేశీ విద్య, అంతర్జాతీయ ఉద్యోగావకాశాలపై మార్గదర్శనం చేశారు.​రెజ్యూమ్‌ రష్ లో భాగంగా ఏఐ సాధనాలు వాడకుండా సొంత సృజనాత్మకతతో రెజ్యూమేల రూపకల్పన.​హెచ్‌ఆర్‌ పోడ్‌కాస్ట్‌, కెరీర్ మెంటరింగ్ లో భాగంగా నిపుణుల అనుభవాలు, ఉద్యోగ సన్నద్ధతపై సలహాలు.​ప్రముఖ సంస్థల భాగస్వామ్యం కావడంతో విప్రో, ఐబీఎం, మారుతి సుజుకి, ఐటీసీ, మోస్చిప్, డాక్టర్ రెడ్డీస్, గ్రీన్‌కో, జియో వంటి 30కి పైగా ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.​పరిశ్రమల అవసరాలు, విద్యాసంస్థల శిక్షణ మధ్య అంతరాన్ని తగ్గిస్తూ విద్యార్థులకు భవిష్యత్ ఉద్యోగావకాశాలపై స్పష్టతనివ్వడానికి ఈ కాన్‌క్లేవ్ ఎంతగానో ఉపయోగపడింది.