BREAKING
రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ

Select Suryaa Now
9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ
 గుంటూరు కలెక్టరేట్  న్యూస్ : భూమి, భుక్తి, విముక్తి పోరులో అమరులైన విప్లవ యోధుల వర్ధంతి సభను ఈనెల 9న గుంటూరులోని అరండల్ పేటలో గల కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి భవనంలో నిర్వహిస్తున్నామని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యు.గనిరాజు తెలిపారు. సోమవారం స్థానిక ఎల్ఈఎం స్కూల్ ఎదురుగా ఉన్న మినీ గూడ్స్ ఆటో స్టాండ్ వద్ద అమరవీరుల వర్ధంతి సభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా గనిరాజు మాట్లాడుతూ తెలంగాణ, నగ్జల్బరి, శ్రీకాకుళ, గోదావరిలోయ, దండకారణ్య పోరాటాల్లో వేలమంది విప్లవకారులు తమ విలువైన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని అన్నారు. నవంబర్ నెలలోనే విప్లవ కమ్యూనిస్ట్ యోధులు కామ్రేడ్స్ చండ్ర పుల్లారెడ్డి, పోట్ల రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, జేసీయస్ ప్రసాద్ వంటి అనేక మంది అమరులయ్యారని తెలిపారు. విప్లవోద్యమంలో కామ్రేడ్స్ చారు మజుందార్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, పైలా వాసుదేవరావు వంటి వారు అమరులయ్యారని తెలిపారు. నవంబర్ 1 నుండి 9 వరకూ అమరవీరుల వర్ధంతి సభలు జరపాలని న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల ప్రాంతాలలో సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరులో నవంబర్ 9 న జరిగే అమరవీరుల వర్ధంతి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు ఎన్వికృష్ణ, నాగరాజు, సుబ్రహ్మణ్యం, శంకర్, పుల్లయ్య, ఆనంద్, బసవయ్య, జీవానంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.