BREAKING
రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం

Select Suryaa Now
మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం
గుంటూరు కలెక్టరేట్,  న్యూస్ : "మురసు" తుఫాన్ నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు తగిన ముందస్తు ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాగునీటి రిజర్వాయర్ల వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య ఎదురైనా సరఫరాకి సమస్య రాకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని, నీటి సరఫరా జరిగే సమయంలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా ఉండేందుకు వీలుగా డ్రైన్లు, కల్వర్టులలో పూడికతీత పనులు పూర్తి చేయబడి ఉన్నాయని, ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అయితే తక్షణం తొలగించడానికి అవసరమైన జేసిబీలను సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే భారీ హోర్డింగ్స్ ని తొలగించామని, మరొక్కసారి పరిశీలించాలని, పాత భవనాల్లో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా తెలియచేయాలని టిపిబిఓలను ఆదేశించామన్నారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించడానికి తగిన సామాగ్రితో బృందం సిద్దంగా ఉండేలా చూడాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. తుఫాన్ నేపధ్యంలో ప్రజలు కాచి వడకట్టిన నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగించాలని, అత్యవసర సహాయం కోసం జిఎంసి కంట్రోల్ రూమ్‌ 0863 2345103ను సంప్రదించవచ్చని తెలిపారు.