BREAKING
ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపు పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేదెవరికో..? టిడిపి చరిత్ర తిరగరాస్తుందా.. వైసీపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా! ఘనంగా ఏ సీ సీ ఏ సక్సెస్ మీట్ 2026 - అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహణ ఈరోజు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు మరియు ప్రయోజనాలు! రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఏకగ్రీవాలపై జగన్ నీతులా..

Select Suryaa Now
ఏకగ్రీవాలపై జగన్ నీతులా..
గుంటూరు కలెక్టరేట్  న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులివెందులతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం జగన్ కు మింగుడు పడటం లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జగన్ కు ఇష్టం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆమోదంతోనే ఏకగ్రీవాలు జరుగుతాయని చెప్పిన జగన్.. ఇప్పుడు ఏకగ్రీవాలపై గగ్గోలు పెడుతుంటే జనం నవ్వుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల్లో ప్రజలకు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నాయకులను ఎన్నుకుంటారని, కానీ జగన్ ఏకగ్రీవాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేయక ముందే ఏకగ్రీవాలపై రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరించారని చెప్పారు. పుంగనూరు, రాయచోటి, పులివెందుల వంటి ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీలు బలంగా ఉన్నారని, ఆయా ప్రాంతాల్లో జగన్ ఎన్నికలు అడ్డుకుకోవాలని చూశారన్నారు. పుంగనూరు, రాయచోటి, నంద్యాల, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో మైనారిటీలు ఏకగ్రీవమయ్యారని, మైనారిటీల వ్యతిరేకి జగన్ అని అన్నారు. రాష్ట్రానికి జగన్ రాబందులా తయారయ్యారని విమర్శించారు. రానున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి జగన్ కు బుద్ది చెబుతారని చెప్పారు.