BREAKING
స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా.. అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అనంతపురం చిన్నారులు చదరంగంలో సత్తా చాటిన అంబిక, అన్విత్.. అభినందనల వెల్లువ

వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు

Select Suryaa Now
వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు

లక్కవరపుకోట, సూర్య : అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంట పొలాలు నీట మునగగా, ఆ నీరు బయటకు వెళ్లకముందే మరోసారి తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయన్న అంచనాలతో అనేక మంది రైతులు పంటలు సాగు చేశారు. అయితే మధ్యమధ్యలో కురిసిన వర్షాలతో పంటల ఎదుగుదల ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో కొంత ఆశ చిగురించింది. కొన్ని ప్రాంతాల్లో పంటలకు కంకులు కూడా రావడంతో దిగుబడిపై ఆశలు పెరిగాయి. ఇంతలో వీచిన తుఫాను గాలులకు కొన్ని చోట్ల పంటలు నేలకొరిగి, పొలాల్లో నీరు చేరింది.
అన్ని కష్టాలను దాటుకుని తుఫాను ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ఉరుషు తుఫాను ప్రభావంతో మండలంలో వర్షాలు కురుస్తుండటంతో రైతుల ఆందోళన మరింత పెరిగింది. కాలువలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో పొలాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పంటలు పూర్తిగా నీట మునిగి, తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే ఇప్పటివరకు బాగున్న పంటలు కూడా దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. వరుణుడి కరుణ కోసం కొన్నాళ్లు ఎదురుచూసిన రైతన్నలు, ఇప్పుడు అవసరానికి మించి కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు అవసరమైన మేరకే నీరు అందితే మంచి దిగుబడి వస్తుందని, వర్షపాతం ఎక్కువైనా, తక్కువైనా చివరకు నష్టపోయేది రైతన్నేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాతకు ప్రకృతి కూడా సహకరించాలని, రైతులు కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చేలా వరుణుడు కరుణించాలని రైతులు కోరుకుంటున్నారు.