BREAKING
క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్!

అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అనంతపురం చిన్నారులు చదరంగంలో సత్తా చాటిన అంబిక, అన్విత్.. అభినందనల వెల్లువ

Select Suryaa Now
అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అనంతపురం చిన్నారులు  చదరంగంలో సత్తా చాటిన అంబిక, అన్విత్.. అభినందనల వెల్లువ

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : చదరంగ క్రీడలో అనంతపురం జిల్లా చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ చదరంగ సమాఖ్య (ఫిడే), అఖిల భారత చదరంగ సమాఖ్య సంయుక్తంగా సోమవారం విడుదల చేసిన 2026 నవంబర్ నెల రేటింగ్ జాబితాలో అనంతపురం జిల్లా ఏ1 చెస్ అకాడమీకి చెందిన అంబిక, ఈ. అన్విత్ అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంబిక 1459 రేటింగ్, అన్విత్ 1457 రేటింగ్ సాధించడం విశేషం.అంబికకు 1459 రేటింగఅనంతపురానికి చెందిన ఎ. అంబిక అశోక్ నగర్‌లోని ఏ1 చెస్ అకాడమీ బ్రాంచ్‌లో చెస్ కోచ్ మెహరాజ్ వద్ద గత రెండేళ్లుగా శిక్షణ పొందుతోంది. ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీల్లో విజయాలు సాధించింది. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-14 బాలికల చెస్ పోటీలకు అనంతపురం జిల్లా తరఫున ఎంపికై రాష్ట్రస్థాయిలో పాల్గొంది. తాజాగా 1459 అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించింది. భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీల్లో రాణించడమే తన లక్ష్యమని అంబిక తెలిపింది. ఆమె తల్లిదండ్రులు లీలావతి (స్కూల్ అసిస్టెంట్, బయాలజీ), వేణుగోపాల్ (ఫిజికల్ డైరెక్టర్, చియ్యేడు)

అన్విత్ లక్ష్యం గ్రాండ్ మాస్టర్ కావడం

ఈ. అన్విత్ కూడా చదరంగంలో ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ 1457 సాధించాడు. అనంతపురం జిల్లా అండర్-9 ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్-2026లో రన్నరప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. పలు జిల్లా, రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీల్లో బహుమతులు సాధించాడు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్, సీనియర్ చెస్ కోచ్ దుర్గాప్రసాద్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడమే తన లక్ష్యమని అన్విత్ పేర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు రోజా (హెచ్‌ఓడీ, ఈసీఈ, పీవీకేకే పాలిటెక్నిక్ కళాశాల), బాలకృష్ణ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీఈ, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల).

చిన్నారులకు అభినందనలు

అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అంబిక, అన్విత్‌లను ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, ఏ1 చెస్ అకాడమీ సీనియర్ చెస్ కోచ్‌లు దుర్గాప్రసాద్, మెహరాజ్, విజయ్ కుమార్‌తో పాటు పలువురు నగర ప్రముఖులు అభినందించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి రేటింగ్ సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో  మేజర్ న్యూస్.