BREAKING
రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం. ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్ సంగారెడ్డి జిల్లా టిఆర్ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే: 9 వికెట్లతో అద్భుత రికార్డు! 33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైజింగ్ స్టార్స్ ఏసియా కప్: ఇండియా ఏ జట్టు ప్రకటన.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీకి చోటు! ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ *విద్యుత్ వినియోగదారుల దినోత్సవం* రూ.100 కోట్లతో శంకర్‌పల్లి–వికారాబాద్ రహదారి విస్తరణ పనులు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో అనంతపురం కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..

కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం

Select Suryaa Now
కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం

సిద్దిపేట రూరల్ : ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సమస్యలపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు టీఎస్ఎస్ సిద్దిపేట జిల్లా బృందం నాయకుడు కొమ్ము రవీందర్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ ఆదేశాల మేరకు నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో కళా ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాలు, పరిసరాల పరిశుభ్రత, రహదారి భద్రత నియమాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, రహదారి భద్రత నియమాలను అనుసరించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి,కళాకారులు కొమ్ము రవీందర్, వెంకటాపురం రవి, మోతె బాబు, ఈ. క్రాంతి కుమార్, బండ మంజుల, నీరటి రవీందర్, ముక్కపల్లి భార్గవి, కొమ్ము ఎల్లయ్య, యేల్పుల తిరుమలయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

(సూర్య రూరల్, రమేష్)