BREAKING
జనసేన కార్పొరేటర్ బాయన రాణి ఘన విజయం కార్పొరేటర్ కాకి గంగరాజు ఘనవిజయం పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్.. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక

నేటితో పరిషత్‌ ప్రచారానికి తెర.... *​ జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్ రెడ్డి *

Select Suryaa Now
నేటితో పరిషత్‌  ప్రచారానికి తెర....  *​ జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్ రెడ్డి *

విజయనగరం, సూర్య : జిల్లాలో నవంబర్‌ 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బహిరంగ ప్రచారానికి నవంబర్ 3వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5:00 గంటలతో తెరపడనుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే ప్రచార గడువు ముగుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ​ఎన్నికలు జరిగే సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటు హక్కు లేని రాజకీయ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు మంగళవారం సాయంత్రం 5:00 గంటలలోపు ఆయా ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాయంత్రం 5:00 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మైకులు, లౌడ్ స్పీకర్లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని, ఇంటింటి ప్రచారం సైతం ఎన్నికల నిబంధనలకు లోబడి మాత్రమే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ​ఎన్నికల కోడ్ ముగిసే వరకు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే సందేశాలు, ప్రకటనలు పంపడంపై సైబర్ విభాగం నిఘా ఉంచుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రచారం ముగిసిన సమయం నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం అమల్లో ఉంటుందని, సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఓటర్లు సహకరించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.