BREAKING
రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం. ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్ సంగారెడ్డి జిల్లా టిఆర్ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే: 9 వికెట్లతో అద్భుత రికార్డు! 33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైజింగ్ స్టార్స్ ఏసియా కప్: ఇండియా ఏ జట్టు ప్రకటన.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీకి చోటు! ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ *విద్యుత్ వినియోగదారుల దినోత్సవం* రూ.100 కోట్లతో శంకర్‌పల్లి–వికారాబాద్ రహదారి విస్తరణ పనులు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో అనంతపురం కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..

మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం

Select Suryaa Now
మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం

 

 

 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. జిల్లా లో గత మూడు నెలలలో ఒక మాతృ , ఏడు శిశు మరణాల పై ప్రత్యక్ష సమీక్ష సమావేశం సోమవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం లోని సమావేశ మందిరంలో డీఎంహెచ్ఓ నాగ శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై రిస్క్ గర్భిణీ స్త్రీలు,శిశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని,ఆసుపత్రిలో ప్రసవాలకు ప్రజలను మోటివేషన్ చేయవలసినదిగా, రిఫరల్స్ ను వెంటనే ఉన్నత కేంద్రాలకు తరలించవలసినదిగా, ప్రతి హైరిస్క్ గర్భవతులను సకాలంలో గుర్తించి వారిని తరచూ స్త్రీ వ్యాధి నిపుణులకు చూపించాలని, ఒకవేళ సమస్య ఉంటే దగ్గర లోని ప్రభుత్వ ఆసుపత్రి నందు వారంకు ముందే చేర్పించాలని తెలిపారు. గర్భవతి అయినది మొదలు, ప్రతి గర్భవతిని సాధారణ కాన్పు కోసం సిద్ధం చేయాలని, మూఢ నమ్మకాలతో, ముహూర్తాలతో ప్రసవాలు చెయ్యరాదని, సాధ్యమైనంత వరకు సిజేరియన్ ఆపరేషన్ జరగకుండా చూడాలని తెలిపారు. గర్భస్థ సమయంలో పౌష్టికాహారం తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నచో రక్తహీనత లేకుండా మాతృ మరణాలను నివారించవచ్చని, అందుకే ప్రతి హై రిస్క్ గర్భిణీని సూపర్వైజర్ స్టాప్ తో మ్యాపింగ్ చేయాలని వీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. పౌష్టికాహారం లోపం లేకుండా, రక్తహీనత లేకుండా, గర్భస్థ సమయంలో రెగ్యులర్ చెకప్ తో శిశు మరణలను నివారించవచ్చని, ఆలాగే లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలసి పక్కా ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. వీలైనంత త్వరగా , కాలయాపన లేకుండా చికిత్స ఇప్పించినచో మాతృశిశు మరణాలను నివారించవచ్చు అన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ అశోక్ కుమార్,డాక్టర్ అనూష,, 

 వెంకటేశ్వరి, మోహన్ బాబు, తాస్కెంట్ ,వివిధ పిహెచ్సి డాక్టర్లు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు ఆశలు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.