*వాహన తనిఖీలు నిర్వహించిన అదనపు ఎస్సై దేవ్ సింగ్
సూర్య అశ్వరావుపేట,అశ్వారావుపేట పట్టణంలో ఎస్‌ఐ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలను తనిఖీ చేస్తూ వాహనదారుల వద్ద అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఎస్‌ఐ దేవ్ సింగ్ సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట