BREAKING
తపోవనం, నాగిరెడ్డిపల్లిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి లాల్ స్వామి విస్తృత ప్రచారం స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటా ఆదరించి ఆశీర్వదించండి.. ఓటర్లకు లాల్ స్వామి విజ్ఞప్తి స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా..

బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి!

Select Suryaa Now
బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి!

గాజువాక, సూర్య : ప్రమాదకరమైన మలుపు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కనీస ముందస్తు రేడియం హెచ్చరిక బోర్డులు లేని రహదారిపై కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. గాజువాక నాతయ్యపాలెం పరిధిలోని తుంగ్లం నుంచి షీలానగర్ వెళ్లే దారిలో ఉన్న ‘కృష్ణ మహంతి చెరువు’ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాలెం అంబేడ్కర్ కాలనీకి చెందిన కిల్లి వరుణ్ కుమార్ (26) కారులో తుంగ్లం వైపు నుంచి షీలానగర్ వెళ్తుండగా, చీకట్లో రహదారిపై ఉన్న ప్రమాదకరమైన మలుపును ముందస్తుగా గుర్తించకపోవడంతో కారు అదుపుతప్పి కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి, నీట మునిగిన కారు డోర్లు తీసి వరుణ్‌కుమార్‌ను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ప్రైవేటు ‘కిమ్స్’ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

చలానాలపై శ్రద్ధ.. నిజాల వెల్లడిపై నిర్లక్ష్యం!

ఈ దుర్ఘటన ఒకెత్తయితే, ప్రమాదం జరిగిన తర్వాత ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అర్ధరాత్రి వేళ ప్రమాదం జరిగి నిండు ప్రాణం బలైనా.. మరుసటి రోజు రాత్రి వరకు మృతుడి వివరాలను గానీ, ప్రమాద కారణాలను గానీ వెల్లడించకుండా దాటవేసే ధోరణి ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గాజువాక పరిధిలో ఇదొక్కటే కాదు.. ఏ ప్రమాదం జరిగినా పూర్తి వివరాలను బహిర్గతం చేయకుండా మరుగున పరుస్తూ బాధ్యతల నుంచి నెట్టుకురావడం వెనుక అంతర్యమేమిటన్నది మింగుడుపడటం లేదు.

డిజిటల్ చలానాల విధింపు, జరిమానాల వసూళ్లపై చూపుతున్న తాపత్రయం.. రహదారులపై కనీస భద్రతా చర్యలు చేపట్టడంలో గానీ, వాస్తవాలను సమయానుకూలంగా వెల్లడించడంలో గానీ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రమాదకరమైన ఆ చెరువు మలుపు వద్ద కనీసం రేడియం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో విఫలమైన యంత్రాంగం, ఘటన జరిగిన తర్వాతైనా వాస్తవాలు బయటపెట్టడంలో ఎందుకు వెనకాడుతోంది? ప్రమాదాలను అరికట్టడంలో లేని ఆసక్తి.. సమాచారాన్ని తొక్కిపెట్టడంలో ఎందుకు కనిపిస్తోందని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీపీ సహా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రహదారులపై పక్కా భద్రతా చర్యలు చేపట్టి, వివరాల వెల్లడిలో పారదర్శకత పాటించేలా ఆదేశాలివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది!