BREAKING
తపోవనం, నాగిరెడ్డిపల్లిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి లాల్ స్వామి విస్తృత ప్రచారం స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటా ఆదరించి ఆశీర్వదించండి.. ఓటర్లకు లాల్ స్వామి విజ్ఞప్తి స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా..

గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు

Select Suryaa Now
గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు

మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ వార్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్ర కలకలం రేపింది. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించడంతో ఇంటి గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న అంజని (24) అనే మహిళ తీవ్రంగా గాయపడింది.వివరాల్లోకి వెళ్తే.. నూతనకల్ వార్డులో బండమీది సూర్యారావుకు చెందిన ఇంట్లో అంజని అద్దెకు నివాసం ఉంటోంది. సోమవారం ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లో ఉన్న అంజనికి మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.పేలుడు శబ్దానికి చుట్టుపక్కల నివాసితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు మంటలను అదుపు చేసి, తీవ్రంగా గాయపడిన అంజనిని చికిత్స నిమిత్తం సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంతో నూతనకల్ వార్డులో భయాందోళన వాతావరణం నెలకొంది.గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఇంటికి భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.