*ఉపాధి హామీ పనులతో గ్రామీణ రహదారికి మరమ్మతులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్
కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ పరిధిలోని గద్దలపల్లి నుండి ముత్తన్నపేట వరకు ఉన్న మట్టి రోడ్డు పై వీబీ–జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం ద్వారా తిరిగి మట్టి పోసే పనులను చేపట్టారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పనుల్లో పాల్గొని జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఇప్పటికే ఉన్న మట్టి రహదారిపై అదనంగా మట్టి పోయడం ద్వారా రహదారిని మరింత మెరుగుపరచి, గ్రామీణ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా చూడడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.