కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంనగర పంచాయతి 2 వ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ పి.రవివర్మ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో చైర్ పర్సన్, 23 వార్డులకు మంగళవారం ఉదయం గం.8.00 ల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మొత్తం 4 రౌండ్లలో చైర్ పర్సన్ 2 టేబుల్స్ పై వార్డు కౌన్సిలర్స్ 6 టేబుల్స్ లో లెక్కించడం జరుగుతుందని తెలిపారు. , కౌంటింగ్ సిబ్బంది 45 మందిని నియమించారని , కౌంటింగ్ వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.