*ఎస్.సి కాలనీ నుండి బంధము వరకు నూతన మురుగునీటి కాలువ నిర్మాణ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందేల సుజాత బాలకిషన్
కోహెడ గ్రామ పరిధిలోని ఎస్.సి కాలనీ నుండి బంధము వరకు నూతన డ్రైనేజీ (మురుగునీటి కాలువ) నిర్మాణ పనులను ఈరోజు మంగళప్రదంగా ప్రారంభించడం జరుగుతుంది. గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పనులు ఎంతగానో దోహదపడతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందేల సుజాత బాలకిషన్, ఉపసర్పంచ్ కందాల వెంకటేష్, అఎంసీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్, పాలకవర్గ సభ్యులు గజ్జెల ప్రవీణ్, గూగిళ్ళ శ్రీనివాస్, నంగునూరి కిరణ్, పొన్నాల శ్రావణి, పంచాయతీరాజ్ ఏఈ సాయిపవన్, మాజీ జడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ గోరిట్యాల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకట్ స్వామి, వేల్పుల మహేష్ బాబు, కాంట్రాక్టర్ అంజయ్య మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు