BREAKING
జనసేన కార్పొరేటర్ బాయన రాణి ఘన విజయం కార్పొరేటర్ కాకి గంగరాజు ఘనవిజయం పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్.. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌జెండర్ అనుమానాస్పద మృతి

Select Suryaa Now
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌జెండర్ అనుమానాస్పద మృతి

కీసర, మేజర్ న్యూస్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కీసర–ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ బైపాస్ సమీపంలోని రాంపల్లి దాయర ఔటర్ బ్రిడ్జి కింద ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన స్వీటీ అలియాస్ శేఖర్ (30–35)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.శేఖర్ కనిపించడం లేదంటూ రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఎల్లక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రాంపల్లి దాయర ఔటర్ బ్రిడ్జి కింద మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. క్లూస్ టీం సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.