BREAKING
గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం

న్యాయవాదులు ఓటు నమోదు చేసుకోండి

Select Suryaa Now
న్యాయవాదులు ఓటు నమోదు చేసుకోండి

వరంగల్ లీగల్: మేజర్ న్యూస్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు సమయం దగ్గర పడుతున్నందున న్యాయవాదులు తమ ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలోని నూతన 10  కోర్టుల భవనంలో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటు నమోదు హెల్ప్ డెస్క్ ను మంగళవారం సందర్శించిన సర్వోత్తమ్ రెడ్డి తొలుత మహిళ బార్ అసోసియేషన్ను సందర్శించి మహిళ న్యాయవాదులను ఓటు నమోదు చేసుకోవాలని, తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.అనంతరం ఓల్డ్ బార్ అసోసియేషన్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాద సంఘాల అధ్యక్షులు చకిలం ఉపేందర్,చొల్లేటి రామకృష్ణ లు బార్ అసోసియేషన్ కు పరిచయం చేసిన అనంతరం తనకు ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులను అభ్యర్థించారు. న్యాయవాదుల సమస్యలపై శాసనసభలో ,మండలి లో పోరాడుతానని న్యాయవాదులకు హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించి న్యాయవాదులకు సేవ చేసే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అధికార కాంగ్రెస్ పార్టీ పని చేసే విధానం చూసి ఓటు వేయాలని, తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన అనంతరం విదేశాల్లో వివిధ కంపెనీలకు సేవలందించానని తన తండ్రి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చానని తెలిపారు. అనంతరం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని  రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత పది ఏళ్ల పాలన ఇప్పుడున్న మూడేళ్ల కాంగ్రెస్ పాలన  లో అభివృద్ధిలో మార్పు ఉంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు మేధావులని విజ్ఞతతో ఆలోచించి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అభివృద్ధికి ఓటేయాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మెన్ గుండు సుధారాణి మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, న్యాయవాదులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అనేక ఇతర సమస్యల కొరకు సర్వోత్తమ్ రెడ్డి పోరాడుతాడని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇనుగాల వెంకటరామిరెడ్డి,హన్మకొండ నియోజకవర్గ  ఎమ్మెల్సీ కన్వీనర్ తొగరు జగన్మోహన్ రెడ్డి, వరంగల్ హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్లు సామంతుల శ్రీనివాస్, తోట రాజ్ కుమార్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రతినిధులు నిమ్మాని  శేఖర్ రావు, నల్ల మహాత్మ, వరంగల్, హనుమకొండ ప్రభుత్వ న్యాయవాదులు రవికుమార్, నరసింహారావు, లేబర్ కోర్టు ఏ జి పి రమణారెడ్డి, ప్రభుత్వ సహాయ న్యాయవాదులు, అదనపు పీపీలు,న్యాయవాదులు లడే రమేష్, డాక్టర్ వేముల రమేష్, బైరాపాక జయకర్,ప్రదీప్ కుమార్, బండి అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజీనీకాంత్, రామ్మోహన్రావు, కార్తీక్, యాకస్వామి, రాజేంద్ర ప్రసాద్, శ్రీధర్ రావు, రాజకుమార్, నిఖిల్, రఘపతి, విష్ణు వర్ధన్, మొగిలి, నునవత్ రమేష్ మహిళ న్యాయవాదులు రమాదేవి, శశిరేఖ, సుశీల, గోపికరాణి,అనిత, రజిత, కే. జ్యోతి, రావుల వాణి, శృతి, ఏంజెలనా, స్వరూపరాణి, ప్రియాంక, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, ప్రదీప్ కుమార్, హనుమకొండ, హనుమకొండ జిల్లా