చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అమిత్ షా సభకు బీజేపీ శ్రేణుల తరలింపు
కీసర , మేజర్ న్యూస్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్న బహిరంగ సభకు నాగారం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. నాగారం మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు సభకు బయలుదేరాయి.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామక్కపేట రవీందర్‌రెడ్డి, నక్క కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు జూపల్లి నరేష్, సుర్వి రాజు గౌడ్, వెంకట్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, నర్సింగ్, వికాస్, మల్లేష్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు నాగారం ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.