వెంపడంలో మణి ఇంటింటి ప్రచారం
పూసపాటి రేగ, సూర్య : మండలంలోని పెంపడం ఎంపీటీసీ స్థానానికి కూటమి తరుపున తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణి ఇంటింటి ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. అభ్యర్థి మణి తెదేపా నాయకుడు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు తో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఎంపీటీసీగా తనను గెలిపిస్తే వెంపడం పరిసర ప్రాంతాలను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తాను అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెంపడం కొంతమంది వెనుకబడి ఉందని, తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే మాజీ సర్పంచ్ పిన్నింటి శ్రీనివాసరావు సహకారంతో సిగ్మెంట్ పరిధిలో అన్ని ప్రాంతాలను మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా అభివృద్ధి చేస్తానంటూ మణి తన ప్రచారలో ఓటర్ల కు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.