అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!
వింజమూరు, మేజర్ న్యూస్ : అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ప్రజలకు పిలుపునిచ్చారుప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పిలుపునిచ్చారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు ప్రజలను కోరారు.ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి ఊపిరి పోస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 'చెప్పాం… చేస్తున్నాం…' అనే నినాదాన్ని ప్రభుత్వం ఆచరణలో చూపిస్తోందని అన్నారు.గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో అవసరమని బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.