ఆత్మకూరు మున్సిపల్ బరిలో 79 మంది - చైర్మన్ అభ్యర్థులుగా నలుగురు
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో చైర్ పర్సన్ అభ్యర్థులుగా నలుగురు బరిలో ఉండగా కౌన్సిలర్ అభ్యర్థులుగా 75 మంది పోటీలో ఉన్నారు. చైర్ పర్సన్ అభ్యర్థులుగా పదిమంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణల అనంతరం నలుగురు రంగంలో మిగిలారు.కౌన్సిలర్ అభ్యర్థులుగా 28 వార్డులకు గాను 148 మంది నామినేషన్ల దాఖలు చేయగా అందులో నలుగురు నామినేషన్లు తిరస్కరణ గురికాగా ఉపసంహరణల అనంతరం 75 మంది రంగంలో ఉన్నారు. కాగా పదో వార్డులో అందరూ ఉపసంహరించుకోవడంతో తెలుగుదేశం కి చెందిన అరిటాకుల కృష్ణవేణి కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 27 వార్డుల్లో 75 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ నెల 1వతేదీ పోలింగ్ జరుగగా 3వతేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగనుంది.
చైర్ పర్సన్ అభ్యర్థులుగా అల్లారెడ్డి ఇందుమతి (వైసిపి), బుర్ర సంతోష (బి.ఎస్.పి), డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా (తెలుగుదేశం), షేక్ ఖాదరున్నిసా (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా
ఒకటో వార్డు నుండి ఏకుల చిన్నయ్య (వైసీపీ), కొమరగిరి శాంత కుమార్ (జనసేన),సింగంశెట్టి ఏడుకొండలు (బి .ఎస్.పి), రెండవ వార్డ్ నుండి అండ్రా సుబ్బారెడ్డి (వైసీపీ), దగ్గు మాటి శివ కోటారెడ్డి (టిడిపి), పత్తిపాటి వెంకటప్రసాద్ (జనసేన), మూడో వార్డునుండి కోడూరు ఓబుల్ రెడ్డి (వైసీపీ), నలిశెట్టి శ్రీనివాసులు (బిజెపి), నాలుగో వార్డ్నుండి షేక్ ముజీబున్నీసా (సిపిఎం), షేక్ షాహిన్ (టిడిపి), ఐదవ వార్డునుండి వాసిలి వెంకటేశ్వర్లు (వైసిపి), షేక్ నాయబ్ రసూల్ (టిడిపి), షేక్ మొహమ్మద్ షఫీ (ఇండిపెండెంట్), ఆరో వార్డునుండి కత్తి పద్మజా (జనసేన), షేక్ ఖాజా మస్తాన్ (వైసీపీ), మునగాల కిరణ్ (ఇండిపెండెంట్), షేక్ మస్తాన్ షరీఫ్ (ఇండిపెండెంట్), ఏడవ వార్డునుండి నోటి వినయ్ కుమార్ రెడ్డి (వైసీపీ), పొన్నూరు హరికృష్ణ (తెలుగుదేశం ), 8 వ వార్డునుండి షేక్ షాకీర (వైసిపి), సయ్యద్ మొబీనా (తెలుగుదేశం), 9వ వార్డునుండి నాగులపాటి స్వప్న (వైసిపి), పుచ్చలపల్లి రాధిక (తెలుగుదేశం), 11వ వార్డునుండి కొలగాని ప్రశాంతి (తెలుగుదేశం), కొలగాని శిరీష (జనసేన), గొరిపర్తి నాగభూషణ మ్మ (వైసిపి), గోరిపర్థి శిరీష (ఇండిపెండెంట్ ),నలిశెట్టి కీర్తి కుమారి (ఇండిపెండెంట్), నలిశెట్టి శివ నాగజ్యోతి (సిపిఐ), 12వ వార్డునుండి గడ్డం అమరావతి (తెలుగుదేశం), బత్తల కవిత (వైసిపి ),గడ్డం సంధ్య (ఇండిపెండెంట్), 13వ వార్డునుండి తోడేటి మాధవి లత (తెలుగుదేశం), షేక్ ప్రవీణ్ (వైసిపి ),14వ వార్డు నుండి తెల్లదాల పద్మమ్మ( వైసీపీ), పచ్చిపాల హరిత (తెలుగుదేశం), 15వ వార్డు నుండి ఎండి ముజీబుల్లా (వైసీపీ), షేక్ మొహిబుల్లా (తెలుగుదేశం), ఎండి అమానుల్లా (ఇండిపెండెంట్), 16వ వార్డునుండి షేక్ కైరున్నీసా (టిడిపి), షేక్ బీబీజాన్ (వైసిపి), 17వ వార్డునుండి ఎండి దిల్షాద్ (వైసీపీ), షేక్ ఖాదర్బాషా (టీడీపీ), షేక్ అల్లాబక్షు (ఇండిపెండెంట్), షేక్ షాహీదుల్లా (ఇండిపెండెంట్), 18 వ వార్డునుండి చల్లా కవిత (టిడిపి ), నెల్లూరు ఆదిలక్ష్మమ్మ (వైసిపి), 19వ వార్డునుండి జంగం నాగరాజు (సిపిఐ), పటాన్ సర్దార్ ఖాన్ (వైసీపీ), షేక్ సర్దార్ (టిడిపి), 20వ వార్డునుండి ఊటుకూరు గురు ప్రసాద్ (టిడిపి), కొప్పోలు సత్యవతి (సిపిఎం), చేజర్ల మనోహర్ (ఇండిపెండెంట్), 22వ వార్డునుండి కావాటి సుగుణమ్మ( వైసీపీ), గురునాథం జయమ్మ (తెలుగుదేశం), వినుకొండ వనమ్మ (సిపిఎం), 23వ వార్డునుండి నందవరం ప్రసాద్ (వైసీపీ), సందిపోగు సుమన్ (టిడిపి), 24 వ వార్డునుండి ఇండ్ల అంకమ్మ (సిపిఐ), తుమ్మల చంద్ర రెడ్డి (టిడిపి), 25 వ వార్డునుండి డక్కా రమణమ్మ (తెలుగుదేశం), యల్లంటి కల్పన (వైసిపి), 26 వార్డునుండి మాదాల కృపాకర్( వైసిపి ), మాదాల శ్రీనివాసులు నాయుడు (తెలుగుదేశం), 27వ వార్డునుండి చెరుకూరు పద్మావతమ్మ (టిడిపి), చెరుకూరు సుప్రజా (వైసిపి), చెరుకూరు స్రవంతి (ఇండిపెండెంట్), 28వ వార్డునుండి తోగుంట స్వప్న (టిడిపి), బొమ్మి సుబ్బరత్నమ్మ (వైసిపి), కొండ శ్రావణి (ఇండిపెండెంట్), గోగుల రమాదేవి (ఇండిపెండెంట్)గా రంగంలో ఉన్నారు.చైర్ పర్సన్ అభ్యర్థులుగా ఒకరు తెలుగుదేశం, ఒకరు వైసీపీ, ఒకరు బీఎస్పీ, ఒకరు కాంగ్రెస్ తరపున ఉండగా కౌన్సిల్ అభ్యర్థుల్లో 24 మంది టీడీపీ,24 మంది వైసీపీ,ముగ్గురు సిపిఎం, ముగ్గురు సిపిఐ, ఒకరు బీఎస్పీ, 14 మంది ఇండిపెండెంట్ లు, ఒక్కరు బిజెపి, 5 మంది జనసేన అభ్యర్థులు రంగంలో ఉన్నారు.